ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్టర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఈ అవార్డును ప్రధానికి అందించారు. విదేశాల నుంచి ప్రధాన మోదీకి వచ్చిన అవార్డుల్లో ఇది 20వ అవార్డు కావడం విశేషం. I am honoured to be conferred the Mubarak Al-Kabeer Order by His Highness the Amir of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al Sabah. I dedicate this honour to the people of India and to the strong friendship between India and Kuwait. pic.twitter.com/fRuWIt34Cx — Narendra Modi (@narendramodi) December 22, 2024 Also Read: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం! స్నేహానికి గుర్తుగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ తదితరులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదిలాఉండగా.. కువైట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం అక్కడి ఎమిర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ లాంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. Also Read: పాప్‌కార్న్ ప్రియులకు బిగ్ షాక్.. రుచిని బట్టి 3రకాల GST! కువైట్, భారత్‌ల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని.. ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబాతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు జరిపాయి. దీనికి ముందుగా ప్రధాని మోదీ.. ప్యాలెస్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఇదిలాఉండగా.. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి కువైట్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్