పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని గత కొంతకాలంగా అక్కడ నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (PTI) పార్టీ కార్యకర్తలు సైనిక స్థావరాలపై కూడా దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మిలటరీ కోర్టు తాజాగా 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది మేలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ మద్దతుదారులు నిరసనలు చేపట్టడంతో ఇవి అల్లర్లకు దారి తీశాయి. Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు ఆ సమయంలో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ భవనం, ఇతర సైనిక స్థావరాలపై నిరసనాకారులు దాడులు చేశారు. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. విచారణ కోసం 103 మందిని మిలటరీ అధికారులకు అప్పగించారు. దీంతో తాజాగా ఈ వ్యవహారంపై మిలిటరీ కోర్టు విచారణ చేపట్టింది. అందులో 25 మందిని దోషులకుగా తేల్చింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్! మిగిలిన వాళ్లకు కూడా శిక్ష విధిస్తామని.. గడువు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. ఇదిలాఉండగా.. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది నుంచి అడియాలా జైల్లో ఉంటున్నారు. ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ మద్దతుదారులు గత నెలలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. Also Read: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ Also Read: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్