/rtv/media/media_files/2026/03/17/pakistan-2026-03-17-06-29-07.jpg)
ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ విరుచుకపడింది. కాబూల్‌లోని మాదకద్రవ్యాల బానిసల చికిత్సా కేంద్రంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మృతి చెందగా మరో 200 మంది గాయపడ్డారని తాలిబన్ గవర్నమెంట్ వెల్లడించింది. ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తారు. సోమవారం స్థానిక సమయం రాత్రి 9:00 గంటలకు నగరాన్ని పెద్ద ఎత్తున పేలుళ్లు కుదిపివేసాయని అక్కడి స్థానిక మీడియా తెలిపింది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ మాట్లాడుతూ డ్రగ్ ట్రీట్‌మెంట్ ఆసుపత్రిలోని అన్ని భాగాలు ధ్వంసమయ్యాయని అన్నారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని, అంతర్జాతీయ నియమాలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మండిపడ్డారు. రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం ప్రజలంతా బయట ఉన్న సమయంలో ఈ దాడులు జరగడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
AFGHAN PAKSITAN WAR
— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) March 16, 2026
NaPak military targeted 1000 bed hospital in Kabul with a missile.
Retaliation is inevitable and must be disproportionate for attacks on civilians, that too patients no less.#Afghanistan#Pakistan#AfghanPakistanWarpic.twitter.com/C9dn2nSmMU
తోసిపుచ్చిన పాక్
అయితే తాలిబన్ల ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఎటువంటి ఆసుపత్రిని లేదా పౌర ప్రాంతాలను లక్ష్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. తాము కేవలం సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పాక్ వెల్లడించింది. ఆయుధ నిల్వ కేంద్రాలు, సాంకేతిక పరికరాల కేంద్రాలపైనే దాడులు చేశామని పేర్కొంది. తాలిబన్ ప్రతినిధి చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారమని పాకిస్థాన్ సమాచార శాఖ కొట్టిపారేసింది.
ప్రముఖ ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "పౌర నివాసాలు, విద్యా సంస్థలు లేదా ఆసుపత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరం. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం,అసహ్యకరం." అని పేర్కొన్నారు.
గత మూడు వారాలుగా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తాలిబన్లు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్ననే పిలుపునిచ్చింది. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ దాడుల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది.
Follow Us