వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకనుంచి గృహ అవసరాలకు 10 కేజీల సిలిండర్ !

అంతర్జాతీయంగా ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

New Update
Oil companies consider smaller, 10 kg domestic cylinders amid Hormuz disruption

Oil companies consider smaller, 10 kg domestic cylinders amid Hormuz disruption

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం దేశంలోని వంటగదిలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల దేశంలో గ్యాస్ కొరత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూసేందుకు ప్రస్తుతం వాడుకలో ఉన్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

భారత్ తమ LPG అవసరాల కోసం ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గ్యాస్ రవాణా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశంలో రోజువారీ వినియోగం సుమారు 93,500 టన్నులుగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అందరికీ గ్యాస్ అందేలా చూడటం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు కేంద్రం పలు మార్పులు చేయాలని భావిస్తోంది. 

Also Read: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు

గృహ అవసరాల కోసం వినియోగించే పాత సిలిండర్లు ప్రస్తుతం 14.2 కేజీలు ఉన్నాయి. ఇప్పటు వీటి స్థానంలో 10 కేజీల గ్యాస్‌ను మాత్రమే నింపి పంపిణీ చేయడం. అయితే 14.2 కేజీల సిలిండర్ ఓ కుటుంబానికి 35 నుంచి 40 రోజులు వస్తుంది. కానీ 10 కేజీల సిలిండర్ సుమారు నెల రోజులు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే గ్యాస్ పరిమాణం తగ్గితే దీనికి అనుగుణంగానే ధరను కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సాంకేతిక సవాళ్లు

మరోవైపు ఈ నిర్ణయం అంత సులభతరం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిలిండర్ రీఫిల్లింగ్ ప్లాంట్లలో యంత్రాలను సర్దుబాటు చేసే విషయంలో.. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి ముందస్తు పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం లేదా చమురు సంస్థల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ నిర్ణయం దేశంలో అమల్లోకి వస్తే.. 10 కేజీల సిలిండర్లు సామాన్యులకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తాయి. కానీ నెలనెలా రీఫిల్లింగ్ చేసుకోవాల్సి రావడంతో వాళ్లకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. 

Also Read: యుద్ధం ఆపేస్తున్నా.. ట్రంప్ సంచలన ప్రకటన

అవన్నీ ఊహాగానాలే

మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ  వివరణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. కేంద్రం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు