Jeju Air plane crash: జెజు విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా హస్తం..?

సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలు ఉండటంతో ఈ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
Jeju Air plane crash

Jeju Air plane crash

సౌత్ కొరియా విమాన ప్రమాదం(South Korea Plane Crash) ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదం సౌత్‌ కొరియా చరిత్రలోనే అత్యంత తీవ్రమైంది. ఈ  ఘటనలో దాదాపు 179 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా..కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ ప్రమాదానికి సంబంధించి రకరకాల ఊహగానాలు ప్రచారంలో ఉన్నాయి. బర్డ్ స్ట్రైక్ వల్లే విమానం కూలిందని మొదట్లో ప్రచారం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అసలైన కారణం ఏంటన్నది తెలియరాలేదు.

నార్త్ కొరియా హస్తం 

ఐతే తాజాగా సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయిలో రెండు దేశాల మధ్య టెన్షన్స్ తలెత్తడం ఇదే మొదటిసారి. గత కొద్ది నెలలుగా నార్త్‌ కొరియా వరుసగా బాలిస్టిక్ మిస్సైల్స్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతానికి నార్త్‌ కొరియాకు జెజు ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఐతే గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. 

Also Read:'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

గతంలో పలు ఘటనలు

1987లో కొరియన్ ఎయిర్‌ఫ్లైట్ 858పై బాంబు దాడి చేసింది నార్త్ కొరియా. ఈ ప్రమాదంలో 115 మంది ప్రయాణికులు చనిపోయారు. విమానంలో నార్త్ కొరియా ఏజెంట్లు బాంబు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఓ ఉదాహరణగా చెప్తుంటారు. 1983లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సౌత్ కొరియా డెలిగేషన్‌పై నార్త్ కొరియా ఏజెంట్లు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

2017లోనూ సౌత్ కొరియాకు చెందిన ఫైటర్ జెట్స్‌ను నార్త్ కొరియా ఫైటర్ జెట్స్ అడ్డగించాయి. ఐతే జెజు ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి నార్త్ కొరియాకు సంబంధం ఉందని ప్రచారం మాత్రమే జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ప్రమాదంపై నార్త్ కొరియా అధికారులు, అంతర్జాతీయ నిపుణులతో కలిసి విచారణ జరుపుతున్నారు.

Also Read: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు