నాసా వ్యామగామి పెటిట్ అరోరా...ఈయన అంతరిక్ష కేంద్రంలో ఆరునెలలుగా ఉంటున్నారు. సునీతా విలియమ్స్ తదితరులతో పాటూ పెటిట్ కూడా ఐసీస్ లో చిక్కుకుపోయారు. వీరందరూ మార్చి లేదా ఏప్రిల్ లో భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. స్పేస్‌లో చిక్కుకుపోయిన వ్యామగాములు ఎప్పటికప్పుడు తమ అప్డేట్ ఫోటోలను, అంతరిక్షంలో జరుగుతున్న పరిణామాల ఫోటోలను నాసాకు పంపిస్తూనే ఉన్నారు. Also Read : ఇవాళ ఏసీబీ ముందుకు కేటీఆర్ తాజాగా పెటిట్ అంతరిక్షంలో కనిపించిన అరోరా అంటూ వీడియోలను, ఫోటోలను పంపించారు. వీటని నాసా (NASA) పోస్ట్ చేసింది. ఇందులో ఆకుపచ్చ రంగులో అరోరా అద్భుతంగా కనిపించింది. చూసిన వారందరూ మెస్మరైజ్ అయిపోయారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి. అరోరా ముదురు ఆకుపచ్చలో చాలా అందంగా ఉంది అంటూ పెటిట్ పోస్ట్‌లో రాశారు. ఇంతకు ముందు కూడా వ్యోమగాములు ఇలాంటి చిత్రాలను చాలానే పంపించారు. అయితే ఇప్పుడు పెటిట్ పంపిన వీడియోలు వాటిన్నిటికంటే అందంగా కనిపించాయి. ఇందులో అరోరాతో పాటూ భూమి మీద లైట్లు కూడా కనిపించాయి. Also Read: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి నెగటివ్ కామెంట్స్... వ్యోమగామి పెటిట్ పంపిన వీడియోకు చాలా మంది ఆశ్చర్యపోయారు. దాంతో పాటూ కొంతమంది అదొక ఫేక్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐఎస్ఎస్ భూమికి అంత దగ్గరగా ఎలా ఎగురగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. వీడియోలో అరోరాతో పాటూ భూమి మీద లైట్లు ఎలా కనిపిస్తున్నాయని అడుగుతున్నారు. దానిని ఏఏఐతో సృష్టించారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరు 250 మైళ్ల దూరంలో ఉన్న వీధి దీపాలను చూడగలరని మీరు విశ్వసించాలనుకుంటే, అది మీ ఇష్టం అంటూ మరొక వ్యక్తి కామెంట్ పెట్టారు. Flying over aurora; intensely green. pic.twitter.com/leUufKFnBB — Don Pettit (@astro_Pettit) January 6, 2025 Also Read: HYD: ఇవాళ ఏసీబీ ముందుకు కేటీఆర్ Also Read : Tirupati Stampede:తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని