BREAKING: రష్యాలో మొజ్తబా ఖమేనీ.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆయనకి అక్కడి ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Iran's new leader Mojtaba Khamenei secretly flown to Russia for surgery, says report

Iran's new leader Mojtaba Khamenei secretly flown to Russia for surgery, says report

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన యుద్ధం మొదలైనప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆయనకి అక్కడి ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తబా.. కాలు సర్జరీ చేయించుకునేందుకు రష్యా మిలిటరీ విమానంలో టెహ్రాన్ నుంచి మాస్కోకు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది.  

Also Read: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఖర్గ్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్..

ఫిబ్రవరి 28 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. అనంతరం సుప్రీం లీడర్‌ బాధ్యతలు ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ స్వీకరించారు. కానీ అప్పటినుంచి ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబాకు తీవ్ర గాయాలైనట్లు ట్రంప్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ అయితే అతడు చనిపోయాడంటూ చెబుతోంది. ఇలాంటి తరుణంలో మొజ్తబా రష్యాలో ఉన్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: యుద్ధం గురించి దుష్ప్రచారం.. దుబాయ్‌లో 19 మంది భారతీయులు అరెస్ట్

Advertisment
తాజా కథనాలు