/rtv/media/media_files/2026/03/30/iran-war-2026-03-30-08-11-27.jpg)
iran-war-makes-petrol-30-percent-costlier-in-america
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతాలకే కాకుండా అమెరికాను కూడా కలవరపెడుతోంది. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం వల్ల అమెరికా అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గ్యాలన్ పెట్రోల్ ధర సుమారు 3 డాలర్లు ఉండేది. ఇప్పుడు అది 4 డాలర్లకు పెరిగింది. దాదాపు 30 శాతం ధరలు పెరిగిపోయాయి. భారతీయ కరెన్సీలో చూస్తే లీటరుకు సుమారు రూ.25 నుండి రూ.30కు ఎగబాకింది. దీంతో మధ్యతరగతి అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి రూట్‌లో అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు 50 శాతం దాకా పెరిగాయి. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో డీజిల్ ధర.. పెట్రోల్ కంటే ఎక్కువగా పెరిగింది. ఇది బ్యారెల్‌కు $1.24 నుంచి $1.34 డాలర్లకు చేరింది. గత నెలలో డీజిల్ ధరలు లీటరుకు సుమారు 30 నుండి 35 రూపాయల వరకు పెరిగాయి.
Also Read: షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు
Iran - America War
యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై భారీగా దాడులు చేసినప్పటికీ.. ఇరాన్(iran america war) ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతీకారం తీర్చుకుంటోంది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడుల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. యుద్ధంలో తాము అనుకున్న ఫలితాలు సాధించకపోవడంతో అమెరికా ఇప్పుడు కాల్పుల విరమణ వైపు వెళ్తోంది. ఇప్పటికే 10 రోజుల పాటు ఇరాన్ ఎనర్జీ కేంద్రాలపై దాడులు చేయమని ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే టార్గెట్‌తో ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణం ట్రంప్‌కు రాజకీయ ముప్పుగా మారుతున్నాయి. గతంలో తక్కువ ఇంధన ధరలను తాను సాధించిన విజయంగా ప్రచారం చేసుకున్న ట్రంప్.. ఇప్పుడు అదే ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రజాదరణ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, యుద్ధం, ద్రవ్యోల్బణం సగటు అమెరికన్ ఓటర్లలో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: DMK మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.2 వేలు, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్..
Follow Us