/rtv/media/media_files/2026/03/26/iran-war-effect-leads-to-lockdown-emergency-2026-03-26-16-04-56.jpg)
iran war effect leads to lockdown emergency
మిడిల్‌ఈస్ట్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు అనేక దేశాలను సంక్షోభంలోకి పడేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది. దీని ప్రభావం వల్ల భారత్‌తో పాటు ఆసియాలోని పలు దేశాల్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో కిలోమీటర్ల కొద్ది క్యూలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రపంచం మళ్లీ కరోనా తరహా లాక్‌డౌన్ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.
महाराष्ट्र के जालना में पेट्रोल-डीजल को लेकर हालात इन दिनों काफी तनावपूर्ण बने हुए हैं। कई पेट्रोल पंपों पर स्टॉक खत्म होने के कारण उन्हें अस्थायी रूप से बंद करना पड़ा, जिससे लोगों की परेशानी बढ़ गई है। जैसे ही चौधरी नगर इलाके के एक पेट्रोल पंप पर ईंधन उपलब्ध होने की खबर फैली,… pic.twitter.com/HUUUBek52A
— AajTak (@aajtak) March 26, 2026
ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తమ దేశంలో 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంధనం, ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరాను పర్యవేక్షించేందుకు స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
🚨🇵🇭 BREAKING: Due to gas shortages, people are now walking to work in the Philippines. pic.twitter.com/mQkwRkRQwP
— Jvnior (@Jvnior) March 25, 2026
Also Read: అందరికీ అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు.. LPG , ATMల నుంచి పాన్ కార్డుల వరకు
దక్షిణ కొరియా
ఇంధన పొదుపును దక్షిణ కొరియా సామాజిక బాధ్యతగా ప్రకటించింది. రాత్రిపూట ఈవీ ఛార్చింగ్‌ను నిలిపివేయడం, తక్కువ దూరం వెళ్లేందుకు సైకిళ్లను వినియోగించడం లాంటి 12 కఠినమైన సూత్రాల నియమావళిని పాటిస్తున్నారు.
శ్రీలంక, పాకస్థాన్‌లో నాలుగు రోజులే పని
ఇంధన వినియోగాన్ని తగ్గించడం కోసం ఈ రెండు దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. శ్రీలంకలో ప్రతి బుధవారం సెలవు దినంగా ప్రకటించారు. ఇలా చేయడం వల్ల 25 శాతం వరకు ఇంధనం ఆదా కావచ్చని ఆ దేశ అధ్యక్షుడు దిసానాయకే తెలిపారు. ఇక పాకిస్థాన్‌లో రెండు వారాల పాటు పాఠశాలలు మూసివేయనున్నారు. 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు.
థాయిలాండ్
థాయ్‌లాండ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రతను 27-27 డిగ్రీల వద్ద ఉంచాలని ఆ దేశ ప్రధాని అనుటిన్ చార్న్‌విరాకులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు సూచించారు.
విమానయాన రంగంపై దెబ్బ
వియాత్నాం ఎయిర్‌లైన్స్ చమురు సంక్షోభం వల్ల కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఏడు ప్రధాన దేశీయ రూట్‌లలో సర్వీసులు నిలివేస్తున్నట్లు ప్రకటన చేసింది. జెట్ ఫ్యూయల్ కొరత, పెరిగిన ఇంధన ధరల వల్ల వారానికి దాదాపు 23 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి.
Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హర్మూజ్ జలసంధి
ఆసియా దేశాలు చమురు అవసరాల కోసం 70 నుంచి 80 శాతం హర్మూజ్ జలసంధి రూట్‌పైనే ఆధారపడతాయి. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటంతో సరఫరా గొలుసు దెబ్బతింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ సంక్షోభం వల్ల ఆయా దేశాలు ఇంకా కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
Follow Us