/rtv/media/media_files/2026/03/23/iran-2026-03-23-16-30-04.jpg)
Iran threatens to mine Gulf if coast, islands attacked
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా భూతల దాడులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ తీరంపై లేదా ద్వీపాలపై దాడులు చేస్తే.. పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పెడతామంటూ హెచ్చరించింది. ఇలా చేస్తే గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. తమ తీరం నుంచే వీటిని సముద్రంలోకి ప్రవేశపెట్టగలమని స్పష్టం చేసింది.
Also Read: F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా దెబ్బతీసిందో తెలుసా.. వెలుగులోకి సంచలన నిజాలు
దీనివల్ల గల్ఫ్ ప్రాంతం మొత్తం కూడా హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులో ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. 1980ల్లో ఏర్పాటుచేసిన సీమైన్స్‌ను తొలగించేందుకు 100 మైన్ స్వీపర్లు యత్నించి విఫలమైన విషయాన్ని మార్చిపోవద్దని గుర్తుచేసింది. ఇదిలాఉండగా ఇరాన్‌లో చమురు ఉత్పత్తికి ఖర్గ్ ఐలాండ్ ఎంతో కీలకమైనది. దాదాపు 90 శాతం చమురు ఇక్కడి నుంచే వస్తుంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఎయిర్‌పోర్టులో ఘోరం: ఫైరింజన్ వాహనాన్ని ఢీకొట్టిన విమానం.. స్పాట్‌లో డెడ్
దీంతో హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ఖర్గ్ ఐలాండ్‌ను ఆక్రమించి ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా 4500 మంది సెయిలర్లు, మెరైన్లను మోహరించింది. అంతేకాదు F-35 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, సాయుధ ల్యాండింగ్ వెహికిల్స్‌తో కూడిన బెటాలియన్‌ను పంపించింది. మరీ అమెరికా నిజంగానే ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటుందా? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. మరోవైపు ఇరాన్.. తమ శత్రు దేశాల నౌకలను మాత్రమే హర్మూజ్ జలసంధి మార్గంలో పర్మిషన్ ఇవ్వమని చెబుతోంది.
Follow Us