/rtv/media/media_files/2026/03/27/iran-fierce-retaliation-devastates-13-us-bases-in-middle-east-2026-03-27-13-21-40.jpg)
Iran fierce retaliation devastates 13 US bases in Middle East
ఇజ్రాయెల్, అమెరికా తమపై దాడులు చేస్తుండటంతో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మిడిల్‌ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక ఆ సైనిక స్థావరాలు ఏమాత్రం నివాసయోగ్యం కానివిధంగా మారిపోయినట్లు తెలిపింది. ఈ స్థావరాల్లో కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎయిర్‌ఫీల్డ్ మౌలిక సదుపాయాలు, ఆయిల్ పైప్‌లైన్‌లు ధ్వంసం అయినట్లు పేర్కొంది. ఇరాన్ దాడులు వల్ల అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం జరిగినట్లు పేర్కొంది.
Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇరాన్ దాడుల వల్ల అమెరికా సైనికులు తమ హోటళ్లు, కార్యాలయాలు ఎత్తేయాల్సిన పరిస్థితులు వచ్చిందని తెలిపింది. అంతేకాదు ఈ నిరంతర దాడుల వల్ల అమెరికా సైన్యంలోని పలు భాగాలను కూడా రిమోట్ వార్‌ఫేర్ స్థితికి వెళ్లిపోయినట్లు కొందరు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల మోహరింపుపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశాలున్నాయని చెప్పారు.
Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి
ఇదిలాఉండగా ఉండగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు మృతిచెందారు. శుక్రవారం నాటికి ఈ యుద్ధం 27 రోజులకు చేరింది. మరోవైపు ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల అయిదురోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై, ఇంధన సదుపాయాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని మరో 10 రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Follow Us