అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది.

New Update
students2

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా భారత్‌ నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థి వీసాలపై అక్కడికి వెళ్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ సంఖ్య చాలావరకు తగ్గింది. తొలి 9 నెలల్లోనే ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. అమెరికా విదేశాంగ శాఖ ఈ గణాంకాలు వెల్లడించింది. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్ నెలవారీ డేటా ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు జారీ అయ్యాయి.  

Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

 2023లో అయితే ఈ సంఖ్య 1,03,485గా ఉంది. కరోనా తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2021లో జనవరి-సెప్టెంబరు మధ్య 65,235 మందికి ఎఫ్‌-1 విద్యార్థి వీసాలు జారీ అయ్యాయి. ఇక 2022లో మొదటి 9 నెలల్లో 93,181 మందికి వీసాలు వచ్చాయి. ఈసారి మాత్రం ఈ సంఖ్య 64,008కి పడిపోయింది. ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదు.. చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాలో కూడా 8 శాతం తగ్గుదల కనిపించింది. చైనాలో ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 73,781 మంది చైనీస్‌ విద్యార్థులకు వీసాలు జారీ అయ్యాయి. గత ఏడాది ఈ సంఖ్య 80,603గా ఉంది. 

Also Read: మొత్తం బంగారమే.. శోభిత వెడ్డింగ్ చీర గురించి ఈ విషయాలు తెలుసా..?

చైనాను వెనక్కి నెట్టిన భారత్

మరోవైపు అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ తొలిసారిగా మొదటిస్థానంలో నిలించింది. గత కొన్నేళ్లుగా తొలిస్థానంలో చైనా ఉండగా.. ఆ దేశాన్ని భారత్‌ ఈసారి వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం (2023-24) నాటికి 3.30 లక్షల మంది స్టూడెంట్స్‌తో ఇండియా మొదటిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398గా ఉంది. మరో విషయం ఏంటంటే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు మొత్తంగా 11.26 లక్షల మంది ఉండగా.. ఇందులో 29 శాతం మంది భారత్‌నుంచే ఉండటం విశేషం. 

Also Read: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఎఫ్‌ 1 వీసా అంటే ఏంటి ?

ఎఫ్‌-1 వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్‌టైమ్ విద్య అభ్యసించడం కోసం ఈ వీసా పర్మిషన్ ఉంటుంది. అమెరికాలో ఉండే యూనివర్శిటీలు ఏటా రెండుసార్లు మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటాయి. ముఖ్యంగా ఆగస్టు -డిసెంబర్ సెమిస్టర్ మధ్య కాలంలో విద్యార్థులు ఎక్కువగా అక్కడికి వెళ్తుంటారు.

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

                                                                                                    

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు