Canada: కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోలాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు అగ్రరాజ్యానికి సాయం అందిస్తామని ట్రూడో పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. Also Read: L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి! వనరులను అందించేందుకు.. కాలిఫోర్నియాలో వ్యాపిస్తున్న మంటల కారణంగా ఐదుగురు చనిపోవడం విషాదకరం. కెనడియన్లు అక్కడున్న ప్రతి ఒక్కరి గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ కార్చిచ్చులు మాకేమీ కొత్తకాదు. కాలిఫోర్నియా అనేకసార్లు మాకు సాయం చేసింది. కెనడియన్ వాటర్ బాంబర్లు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మా పొరుగుదేశమైన అమెరికాకు మరిన్ని వనరులను అందించేందుకు మేము రెడీగా ఉన్నామని ట్రూడో చెప్పుకొచ్చారు. కెనడాను 51 వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ చాలాసార్లు ప్రతిపాదించారు.ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం ఈ ప్రతిపాదనను మరోసారి లేవనెత్తారు. అందుకు అవకాశమే లేదని కెనడా ప్రధాని ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ అంశం పై వివాదం కొనసాగుతున్న వేళ..అమెరికాకు సాయం చేస్తామంటూ ట్రూడో ముందుకు రావడం గమనార్హం. Also Read: Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు! మరోవైపు లాస్‌ఏంజెలెస్ కార్చిచ్చు గురువారం హాలీవుడ్ హిల్స్‌కు వ్యాపించింది. మొత్తంగా 2,000 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్్నాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు మొత్తం ఆరుచోట్ల కార్చిచ్చు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. 50 బిలియన్ డాలర్ల సంపద కాలి బూడిదైందని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 1700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోరనియా సిద్ధం చేసింది. Also Read: Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు Also Read: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్