/rtv/media/media_files/2026/03/08/dubai-2026-03-08-10-23-14.jpg)
Effect of war on Ramadan celebrations
Ramadan celebrations : ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రంజాన్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల్లో రంజాన్ వేడుకలు బోసిపోయాయి. దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రార్థనలను రద్దు చేశారు.దీంతో దుబాయ్ మహా నగరం కళా విహీనంగా కనిపిస్తోంది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న యుద్ధం దుబాయ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం గా ఉన్న దుబాయ్ నేడు భయంతో బిక్కుబిక్కు మంటోంది. దుబాయ్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో రంజాన్ పలు ప్రాంతాల్లో ప్రార్థనలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే యద్ధ ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం రంజాన్ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రాణభయంతో దుబాయ్ వాసులు వేడుకలు జరుపుకుంటున్నారు.
మసీదుల లోపల మాత్రమే ప్రార్థనలు నిర్వహించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్లోబల్ విలేజ్‌లో ప్రసిద్ధ ఈద్ బాణసంచా వేడుకలు రద్దు చేయడంతో పాటు.. విలేజ్‌ను తాత్కాలికంగా మూసివేసిన ప్రభుత్వం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా దుబాయ్ పై ఇరాన్ వరుస దాడులు కొనసాగిస్తోంది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుబాయ్‌లో రంజాన్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది, దీనివల్ల పర్యాటకం, వాణిజ్యం, సాధారణ జనజీవనం స్తంభించిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాత్రి మార్కెట్లు, బహిరంగ ఇఫ్తార్ విందులు, పండుగ సందడి తగ్గాయి, షాపింగ్ మాల్స్, బీచ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెరగడం, క్షిపణి దాడుల భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
యుద్ధం వల్ల రంజాన్ వేడుకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధారణంగా రంజాన్ సమయంలో ఉండే సందడి, హడావుడి ఇప్పుడు లేవు, చాలా ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు మూసివేయబడ్డాయి. భద్రతా భయాలతో పర్యాటకులు దుబాయ్‌కు రావడం తగ్గించారు, దీనితో నగరమంతా 'ఘోస్ట్ టౌన్'గా మారుతోంది. చమురు సరఫరాలో అంతరాయం, యుద్ధ భయాల వల్ల నిత్యావసర వస్తువుల, డ్రైఫ్రూట్స్ ధరలు ఆకాశాన్నంటాయి. షేక్ మహమ్మద్ సెంటర్ ఫర్ కల్చరల్ అండర్‌స్టాండింగ్ వంటి ప్రాంతాల్లో భద్రతను కఠినతరం చేశారు, విమానాలు రద్దవుతున్నాయి కొన్ని దారి మళ్లిస్తున్నారు.ఇరాన్-ఇజ్రాయెల్/అమెరికా ఘర్షణల కారణంగా, ప్రజలలో అనిశ్చితి, భయం నెలకొంది, ఇది పండుగ ఉత్సాహాన్ని పూర్తిగా దెబ్బతీసింది. , ఈ ఏడాది రంజాన్ దుబాయ్‌లో సంప్రదాయ వేడుకలకు బదులుగా, యుద్ధం నీడలో భయానక వాతావరణంలో గడుస్తోంది.
ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో నిత్యం దుబాయ్ నగరం కళకళలాడుతూ ఉండేది. పశ్చిమాసియాలో యుద్ధం దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలను మూసేశారు. రోడ్లపై జనసంచారం లేదు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బీచ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురి కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చాలా మంది దేశం విడిచి ఇప్పటికే వెళ్లిపోయారు.
Follow Us