Trump: కమలా హారిస్‌కు బిగ్ షాక్.. స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్ హవా

పోలింగ్‌కు కొన్ని గంటల ముందు స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్‌నకు 48 శాతం అనుకూలంగా ఉన్నారని తాజాగా అట్లాస్ ఇంటెల్ పోల్స్‌ తెలిపింది.

New Update
Trump kamala

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్‌కు కొన్ని గంటల ముందు స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ట్రంప్‌నకు 48 శాతం అనుకూలంగా ఉన్నారని తాజాగా అట్లాస్ ఇంటెల్ పోల్స్‌ వెల్లడించింది. ఇది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు వచ్చిన మద్దతు కంటే 1.8 శాతం అధికంగా ఉందని పేర్కొంది. నవంబర్‌లో తొలి రెండు రోజుల్లో ఈ సర్వేను నిర్వహంచారు. ట్రంప్ కూడా చివరిదశ పోలింగ్ ప్రచారాన్ని ఈ స్వింగ్ స్టేట్స్‌లోనే నిర్వహించారు. 

Also read: దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది!

Donald Trump - Kamala Harris

స్వింగ్ స్టేట్స్‌ అయిన అరిజోనా, జార్జియా, నార్త్ కరోలినా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్స్‌, పెన్సిల్వేనియాలో ట్రంప్ హవా కొనసాగుతున్నట్లు సర్వే తెలిపింది. అరిజోనాలో 51.9 శాతం, నెవడాలో 51.4 శాతం, నార్త్‌ కరోలినాలో 50.4 శాతం ట్రంప్‌నకు మద్దతిస్తున్నట్లు చెప్పింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఈ స్వింగ్‌ స్టేట్సే కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని రెడ్, బ్లూ స్వింగ్‌ స్టేట్స్‌గా కూడా పిలుస్తారు. 

Also read: ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ

1980 నుంచి రిపబ్లికన్లు గెలుస్తున్న రాష్ట్రాలను రెడ్‌ స్టేట్స్ అంటారు. 1992 నుంచి డెమోక్రాట్లు గెలుస్తున్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్‌గా అభివర్ణిస్తారు. వీటిలో ఫలితాలు కూడా అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాయి. ఈ స్వింగ్‌ స్టేట్స్‌లో రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అధ్యక్షునిగా ఎవరూ గెలిచినా కూడా ఈ రాష్ట్రాల్లో స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కుతారు. 2020లో అరిజోనాలో బైడెన్ కేవలం 10 వేల ఓట్లతో మెజార్టీ సాధించారు. ఈ రాష్ట్రంలో డెమోక్రాట్లు ముందంజలో ఉన్నారని అక్టోబర్ 29న రాయిటర్స్-ఇప్రాస్‌ సర్వే వెల్లడించింది. 

Also read: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్

Also Read :  టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు