/rtv/media/media_files/2026/03/22/cuba-hit-by-second-nationwide-blackout-in-under-a-week-amid-deepening-energy-crisis-2026-03-22-13-46-33.jpg)
Cuba hit by second nationwide blackout in under a week amid deepening energy crisis
అమెరికా తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ రోజుకు 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉన్నాయి. శనివారం క్యూబా రాజధాని హవానాతో సహా దేశమంతటా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ విషయాన్ని క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. గత అయిదు రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలా పవర్ గ్రిడ్ కుప్పకూలడం ఇది రెండోసారి. దీన్నిబట్టి అక్కడ విద్యుత్ సంక్షోభం ఎంతటి తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.. 12 మందికి సోకిన వైరస్.. భయాందోళనలు స్థానికులు
ఈ ఏడాది జనవరి 3న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే క్యూబాకు చమురు కష్టాలు మొదలయ్యాయి. క్యూబాకు వెనెజువెలా నుంచే పెద్దఎత్తున చమురు దిగుమతి అవుతుంది. మదురోను అరెస్టు చేయడం వల్ల దిగుమతులు ఆగిపోయాయి. అంతేకాదు మదురోను అరెస్టు చేసే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని క్యూబా వ్యతిరేకిచింది. దీంతో ఇతర దేశాలు కూడా క్యూబాకు ఇంధనం సరఫరా చేయొద్దని ట్రంప్ ఆంక్షలు విధించారు.
Also Read: ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన
క్యూబాకు చమురు రాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిలిచిపోయాయి. దీంతో క్యూబా ప్రభుత్వం కరెంట్ లేక కోతలు విధిస్తూ వచ్చింది. చివరికి దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, మందులు, ఇతర కనీస అవసరాలు లేక అవస్థలు పడుతున్నారు. చివరికి సెల్‌ఫోన్లలో చార్జింగ్‌లు లేక ప్రజల మధ్య కమ్యూనికేషన్ కూడా దెబ్బతింది. టూరిజంపై ఆధారపడే విమాన సర్వీసులు కూడా రద్దవుతున్నాయి. మొత్తానికి క్యూబా పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా ఉంది. విద్యుత్ లేక, కనీస అవసరాలు కొరతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Follow Us