/rtv/media/media_files/2026/03/26/iran-2026-03-26-16-41-16.jpg)
Chief of Iran's elite naval force, responsible for Hormuz blockade, killed
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) నౌకాదళ చీఫ్ అలీరెజా తంగ్సిరిని మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఇరాన్ తీర ప్రాంతమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. హర్మూజ్ జలసంధిని మూసివేతను అలీరెజానే పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. 2018 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇరాన్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: అందరికీ అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు.. LPG , ATMల నుంచి పాన్ కార్డుల వరకు
ఇదిలాఉండగా.. పశ్చిమాసియాలో ఇరాన్ మిస్సైల్స్ దాడులు కొనసాగుతుండటంతో అబుదాబీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లోని కెఫర్ ఖాసీం ప్రాంతంలో అయిదుగురు, టెల్ అవీవ్‌లో ఇద్దరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం, అణు మౌలిక సదుపాయలకు సంబంధించిన పరిశ్రమలపై దాడులు చేసినట్లు IRGC పేర్కొంది. అయితే ఈ దాడుల్లో అలీరెజా మృతి చెందడంతో ఇరాన్‌కు హర్మూజ్ జలసంధిపై పట్టు పోయే పరిస్థితులు కనిపిస్తున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఈ యుద్ధంలో ఇరాన్‌కు రష్యా డ్రోన్లు సరఫరా చేస్తోందనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై రష్యా కూడా స్పందించింది. తాము ఇరాన్‌కు డ్రోన్లను సరఫరా చేయడం లేదని.. ఇవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.
Follow Us