Russia: ఆ విమానాన్ని కూల్చింది రష్యానే ..కానీ!

అజర్‌బైజాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్‌ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలియెవ్‌ ఆరోపించారు.

New Update
russia

russia

అజర్‌బైజాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్‌ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలియెవ్‌ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ..ప్రమాద కారణాన్ని దాచేందుకు మాస్కో యత్నించిందని విమర్శించారు.

Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు!

Russia Plane Crash

ఈఘటన పై రష్యా అధినేత పుతిన్‌ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ఆయన ఈ మేరకు స్పందించారు. జరిగిన నేరాన్ని అంగీకరించాలని కోరారు.'' ఆ విమానాన్ని రష్యానే కూల్చేసినట్లు స్పష్టంగా తేల్చిచెప్పారు.అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందని తెలపలేదు.

Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి

ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడం ద్వారా..నిజాన్ని కప్పిపుచ్చేందుకు రష్యా అధికారులు యత్నించారు. ఇది విచారకరం.ఘటనానంతరం మొదటి మూడు రోజులు తప్పుడు వాదనలే చేయడం దురదృష్టకరం'' అని అలియెవ్‌ చెప్పారు.

Also Read: Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి!

జరిగినదానికి క్షమాపణలు చెప్పడంతో పాటు ,తప్పును ఒప్పుకొని ఈ ఘటనకు కారణమైనవారి పై తీవ్ర చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేసినట్లు అజర్‌బైజాన్‌ మీడియా తెలిపింది. ఈ నెల 25న అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన జె2-8243 విమానం..దేశ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి బయల్దేరింది.

Also Read: Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా!

కజఖ్‌స్థాన్‌ లో ల్యాండింగ్‌ సమయంలో కుప్పకూలింది.ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా..29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు రష్యానే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే క్షమాపణలు చెప్పిన పుతిన్‌..ప్రమాదానికి తామే కారణమని వస్తున్న ఆరోపణలను మాత్రం ఒప్పుకోలేదు.తామే బాధ్యులమని చెప్పలేదు.

మరోవైపు..ఈ వ్యవహారం పై అజర్‌బైజాన్‌ అధ్యక్షుడితో పుతిన్‌ మరోసారి ఫోన్‌ లో మాట్లాడినట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు