BIG BREAKING: ఇరాన్‌ యురేనియం శుద్ధి చేయలేదు.. యుద్ధం అనుకున్నదాని కన్నా ముందుగానే ముగుస్తుంది: నెతన్యాహు

ఇరాన్‌తో యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికన్నా ముందే ముగియవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. తాము జరిపిన దాడుల వల్ల ఇరాన్‌కు యురేనియం శద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసే సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.

New Update
Netanyahu says iran can no longer enrich uranium

Netanyahu says iran can no longer enrich uranium

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికన్నా ముందే ముగియవచ్చని పేర్కొన్నారు. తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇక మీదట ఆ దేశానికి యురేనియం శద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసే సామర్థ్యం లేదని స్పష్టం చేశారు. 

అంతేకాదు తాను మరణించినట్లు వస్తున్న వార్తలపై కూడా నెతన్యాహు స్పందిచారు. నేను బతికే ఉన్నానని అందుకు మీరే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్‌ను ప్రస్తుతం ఎవరు పాలిస్తున్నారనేది తమకు తెలియదన్నారు. ఇప్పటివరకు మొజ్తాబా కనిపించలేదని. ఆ దేశంలో నేతల్లో, సైనిక దళాల మధ్య చీలిక వచ్చిందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ గెలవనున్నాయని.. ఇరాన్ పూర్తిగా నాశనం అవుతుందని తెలిపారు.  

Also Read: హర్ముజ్ జలసంధిలో అంతరాయం.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏకమైన ప్రపంచ దేశాలు

ఇరాన్‌పై మూడు టార్గెట్‌లను సాధించేందుకు తాము ఈ సైనిక చర్యను చేపట్టినట్లు తెలిపారు. ఇరాన్‌ నుంచి అణుముప్పు తొలగించడం, ఆ దేశ సైనిక సామర్థ్యాలను అణిచివేయడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం తమ ఆపరేషన్ ఉద్దేశమని పేర్కొన్నారు. తమ దాడుల వల్ల ఇరాన్‌కు భారీగా నష్టపోయిందని.. ముఖ్యంగా దాని క్షిపణి నిల్వలు, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలపై దెబ్బకొట్టినట్లు స్పష్టం చేశారు. 

అలాగే ఇరాన్‌తో యుద్ధం చేసేందుకు అమెరికాను ఇజ్రాయెల్ లాగిందంటూ వస్తున్న ఆరోపణలను కూడా నెతన్యాహు ఖండించారు. అమెరికాకు ఏం మంచిదో ట్రంప్‌కు తెలుసని.. దాని ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా యుద్ధం వైమానిక దాడులతోనే జరుగుతోందన్నారు. మరోవైపు ఇరాన్‌.. హర్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని బెదిరించేందుకు యత్నిస్తోందని.. కానీ ఇది ఫలించదని పేర్కొన్నారు. 

Also Read: వీధిలో ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు రూ.3.5 లక్షల జరిమానా

Advertisment
తాజా కథనాలు