దక్షిణ కొరియాలో ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన మరువకముందే మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం కూడా జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ విమానం సోమవారం ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. Also Read: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్ అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని మళ్లీ గింపో ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చినట్లు సమాచారం. పైలట్ ముందుగా అప్రమత్తం కాకపోయి ఉంటే మరో ప్రమాదం జరిగేది. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన ఇదిలాఉండగా.. ఆదివారం థాయ్‌ల్యాండ్ నుంచి వస్తున్న విమానం సౌత్ కొరియాలో మయాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో 181 మంది ఉండగా 179 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సామాన్యులకు కూడా ప్రయాణించేందుకు అందుబాటులో ధరలు ఉంటాయనే గుర్తింపు కూడా ఉంది. Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన Also Read: షాకింగ్ న్యూస్.. స్టేడియంలో 15 అడుగుల ఎత్తుపై నుంచి పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!