Russia : ఇరాన్‌కు సాయం నిలిపివేయలేదు... స్పష్టం చేసిన రష్యా

పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు నిఘా సమాచారం నిలిపివేసినట్లు వస్తు్న్న వార్తలను రష్యా ఖండించింది. ఈ మేరకు అమెరికాకు రష్యా ప్రతిపాదించినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అధ్యక్షుడు పుతిన్‌ కార్యాలయం ఖండించినట్లు స్పష్టం చేసింది.

New Update
Putin

Putin

Russia:  పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు నిఘా సమాచారం నిలిపివేసినట్లు వస్తు్న్న వార్తలను రష్యా ఖండించింది. ఈ మేరకు అమెరికాకు రష్యా ప్రతిపాదించినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అధ్యక్షుడు పుతిన్‌ కార్యాలయం ఖండించినట్లు స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ కూడా తాము చేయలేదని తేల్చి చెప్పింది. కాగా ఉక్రెయిన్‌ కు అమెరికా అందిస్తున్న నిఘా సమాచారాన్ని అందించకపోతే తామూ కూడా ఇరాన్‌ కు నిఘా సమాచారం అందించే విషయంలో వెనక్కు తగ్గుతామని రష్యా ప్రతిపాదించినట్లు అమెరికా మీడియా సంస్థ పోలిటికోలో వార్తలు రావదాన్ని రష్యా అధ్యక్షుడి కార్యాలయం క్రెమ్లిన్ తాజాగా తోసిపుచ్చింది

  పొలిటికో వచ్చిన కథనాల ప్రకారం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి కిరిల్ డిమిట్రియేవ్ ఇటీవల అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ ల వద్ద ఈ అంశాన్ని ప్రతిపాదించినట్లు రాసుకొచ్చింది. అమెరికా ఉక్రెయిన్‌కు నిఘా సమాచారాన్ని అందించడం నిలిపివేయాలని రష్యా కోరినట్లు అందులో ఉంది. అలా చేస్తే అందుకు ప్రతిగా తామూ ఇరాన్ విషయంలో వెనక్కు తగ్గుతామని ఆయన అన్నారని అందులో పేర్కొన్నారు. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని పొలిటికోలో కథనం వెలువడింది. ఈ చర్చల్లో పాల్గొన్నట్లు పేర్కొంటూ కొందరిని ఉటంకిస్తూ పొలిటికో ఈ వార్తలను ప్రచురించింది.

ఈ కథనాలపై రష్యా ప్రతినిధి కిరిల్ డిమిట్రియేవ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలన్నీ తప్పుడు వార్తలని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు, అమెరికా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యురాలు ఆనా పౌలీనా కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్రెయిన్‌లోని యుద్ధ అనుకూల వర్గాలకు పొలిటికో ఒక కరపత్రంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్‌హౌజ్‌లోని వ్యవహారాలు, అంతర్గత చర్చలపై పొలిటికోకు ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అవన్నీ కల్పిత కథనాలని పేర్కొన్నారు. రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉన్న ఇలాంటి కథనాలను ఎవరూ పట్టించుకోవద్దని ప్రజలను కోరారు.  

కాగా అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్దం మూలంగా  పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికాకు చెందిన మరో అంతర్జాతీయ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు కూడా  ఇటీవల కీలక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్‌ల కదలికలకు సంబంధించిన కీలక నిఘా విషయాలను రష్యా ఇరాన్‌కు చేరవేసిందని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్తలను కూడా పుతిన్‌ కార్యాలయం క్రెమ్లిన్ అప్పట్లో ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం విషయమై ఇరాన్‌ తొలి నుంచీ రష్యాకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు  డ్రోన్‌లను కూడా ఇరాన్ సరఫరా చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడటం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు