తుర్కియేలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్లతో కలిసి బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ఏకంగా ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. తుర్కియేలోని అంతల్యా ప్రావిన్సులోని ఉన్న ఓ రోగిని ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యుల బృందం హెలికాప్టర్‌లో బయలుదేరింది. ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! అందులో ఇద్దరు పైలట్లు, ఒక వైద్యుడు మరో వైద్య సహాయకుడు ఉన్నారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి నాలుగో అంతస్తును ఢీకొట్టి కుప్పకూలింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. Ambulance Helicopter Crashes Into Hospital Building In Turkey Additional footage from scene of helicopter crash into hospital in Mugla, Türkiye https://t.co/ZJJErGHqPl pic.twitter.com/DDi92OaDdV — Türkiye Today (@turkiyetodaycom) December 22, 2024 Also Read: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం! హెలికాప్టర్ బయలుదేరుతున్న సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి భవనం బయట హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. Helicopter crashes into Mugla Training & Research Hospital in Türkiye, landing in empty area. Emergency teams on-site managing situation pic.twitter.com/SGbAFXY8ea — Türkiye Today (@turkiyetodaycom) December 22, 2024 Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్