ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రజలకు సమాచారం అందించేది జర్నలిస్టులే. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు వార్తలు సేకరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తుంటాయి. మరికొందరైతే తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే జర్నలిస్టులను టార్గెట్ చేసి మరి హత్య చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారు. ఇందులో సగం మంది గాజాలోనే మృతి చెందారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఓ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. Also Read: తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్.. 104 Journalists Killed In 2024 ఐఎఫ్‌జే ప్రధాన కార్యదర్శి ఆంథోనీ బెల్లాంగర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' 2024లో మొత్తం 104 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2023లో 129 మంది మృతి చెందారు. అయినాకూడా అత్యంత ఘోరమైన సంవత్సంగా 2024 నిలిచింది. 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాలో కనీసం 138 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో చాలామందిని ఉద్దేశపూర్వకంగా హత్యచేశారు. మరికొందరు యుద్ధంలో మృతి చెందారని'' వివరించారు. Also Read: ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు! ఇక ఆసియాలో 20 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. వీళ్లలో పాకిస్థాన్‌లో ఆరుగురు, బంగ్లాదేశ్‌లో ఐదుగురు, ఉక్రెయిన్‌లో నలుగురు, భారత్‌లో ముగ్గురు మృతి చెందినట్లు వెల్లడించింది.ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా 520 మంది జర్నలిస్టులు జైళ్లో ఉన్నట్లు ఐఎఫ్‌జే పేర్కొంది. 2023లో 427 మంది జైళ్లలో ఉన్నట్లు చెప్పింది. ఇందులో చైనాకి చెందిన జర్నలిస్టులే ఎక్కువగా ఉన్నారు.135 జర్నలిస్టులు హాంకాంగ్ జైళ్లలో ఉన్నట్లు చెప్పింది. Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మతనాయకుడికి 50 ఏళ్లు.. Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?