Mumbai Crime: మహారాష్ట్ర (Maharashtra) లో దారుణం జరిగింది. 20 ఏళ్ల ఓ యువతిపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్‌లలో సర్జికల్ బ్లేడ్‌తో పాటు రాళ్లను అమర్చాడు ఓ నిందుతుడు. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన యువతి.. తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో నివసిస్తోంది. జనవరి 21వ తేదీన ఇంట్లో గొడవ జరగడంతో ఇంట్లోనుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చింది.
Also Read: దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..
యువతిపై అత్యాచారం - Woman Raped In Mumbai
ఇంటినుంచి బయటకు వచ్చి నలసోపారా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ ను కలుసుకుని తన కుటుంబ సమస్యలు అతనితో పంచుకుంది. దీనిని అదునుగా మలుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను ఆర్నాలా బీచ్‌కు తీసుకువెళ్లాడు. రాత్రంతా అక్కడే గడిపారు. అప్పుడే ఆ ఆటో డ్రైవర్ యువతిపై రెండుసార్లు అత్యాచారానికి (Rape) పాల్లపడ్డాడు. అనంతరం ఆమెను నలసోపారా స్టేషన్ వద్ద వదిలేశాడు. అనంతరం ఆటో డ్రైవర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
ప్రైవేట్ భాగాల్లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు..
మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్ , రాళ్లను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు ఆ వస్తువులను తొలగించారు, ఆమె ఫిర్యాదు మేరకు ఆటోరిక్షా డ్రైవర్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళకు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులను విచారించగా ఆమె తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. మానసిక సమస్యలతో బాధపడటం వంటి విషయాలను పోలీసులకు వెల్లడించారు. '
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!