Viral Video: వేరే అబ్బాయితో మాట్లాడిందని.. నడి రోడ్డుపై మెడకు కండువా బిగించి!

ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని వేరే అబ్బాయితో మాట్లాడిందని ఆమెను చంపడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. పట్టపగలు రోడ్డు మీద కండువాను ఆమె మెడకు బిగించాడు. ఆ విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు గమనించి రక్షించారు.

New Update
crime ar

crime ar Photograph: (crime ar)

విద్యార్థిని వేరే అబ్బాయితో మాట్లాడిందని పట్టపగలు రోడ్డు మీద చంపడానికి ఓ యువకుడు ప్రయత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఓ విద్యార్థిని మెడికల్ కాలేజీలో చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాహుల్ అనే వ్యక్తితో ఆ విద్యార్థిని స్నేహం చేస్తోంది.

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

వేరే అబ్బాయితో మాట్లాడిందని..

ఇటీవల ఆ విద్యార్థిని వేరే అబ్బాయితో మాట్లాడటం రాహుల్ చూశాడు. కోపంతో ఆ విద్యార్థినిపై దాడి చేయడానికి పాల్పడ్డాడు. తన మెడలో ఉన్న కండువాతో ఆమె మెడను చుట్టి పట్టపగలు చంపడానికి ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని నేల మీద పడిపోయిన కూడా వదలకుండా చంపడానికి ప్రయత్నించగా.. కేకలు పెట్టింది. దీంతో స్థానికులు వెంటనే ఆ విద్యార్థిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. బాధితరాలి కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:  నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు