తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులకి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! పూర్తి వివరాలు తెలియాల్సి.. పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపుగా 70 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. పొరుగున్న కొందరు వ్యక్తుల నుంచి తమకు వేధింపులు వచ్చాయని.. దాని కారణంగానే చంపేసినట్లుఆ యువకుడు తెలిపాడు. తమ ఇల్లు కబ్జా చేయాలని కొందరు చూశారని.. వారిని అడ్డుకునేందుకు తాను తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని తెలిపాడు. 15 రోజులుగా చలిలో తిరిగామని.. ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నామని అన్నాడు. తమ ఇంటి పత్రాలు తమవద్దే ఉన్నా.. సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లకు మొదట విషం పెట్టి చంపానని.. ఆ తర్వాత చేతి మణికట్టు నరాలు కోసి.. ఊపిరాడకుండా చేశానని ఆ యువకుడు తెలిపారు. ఇది కూడా చూడండి: RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి