Accident: సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులపైకి దూసుకెళ్లిన లారీ

సిద్ధిపేట కలెక్టరేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొహెడ మండలం తంగళపళ్లి గ్రామానికి చెందిన బాలకిష్టయ్య, రేణుక దంపతులు ప్రయాణిస్తున్న బైకుపైకి లారీ దూసుకెళ్లింది. భర్త అక్కడిక్కడే చనిపోగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
accident sdpt

Bike and lorry Accident in Siddipet

Accident: తెలంగాణ సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద బైకుపై వెళ్తున్న దంపతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే చనిపోగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయమై రక్తం కారుతున్నప్పటికీ నెత్తుటి మడుగులో పడివున్న భర్త మృతదేహాన్ని పట్టుకుని ఆమె రోధిస్తున్న దృశ్యం గుండెలను పిండేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ప్రమాదానికి గురైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 

కలెక్టరేట్ మూల మలుపులోనే..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఎరవెళ్లి బాలకిష్టయ్య, రేణుక పనిమీద సిద్ధిపేటకు వెళ్లారు. అయితే పని ముగించుకుని తిరుగు ప్రయాణమై వస్తుండగా కలెక్టరేట్ దగ్గర మూల ములపులో వెనకనుండి వేగంగా వచ్చిన లారీ దంపతులు ప్రయాణిస్తున్న బైకును ఢీ కొట్టింది. దీంతో బాలక్రష్టయ్యపైకి లారీ ఎక్కడంతో అక్కడిక్కడే మరణించగా రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, పోలీసులు బాధితుల బంధువులకు సమాచారం అందించారు. డెడ్ బాడిని ఆస్పత్రికి తరలించారు. లారీని అక్కడే పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చదవండి: Gulf: గల్ఫ్‌ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి!

ఇదిలా ఉంటే..  సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు ఖమ్మం మీదుగా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌  వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైరు పేలడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.

Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు