TG: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

New Update
karnul accident

Medak road accident

Medak Road Accident :  దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. రోడ్ల పై ఇష్టానుసారంగా వాహనాలు తోలుతూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు కొందరు. పోలీసులు ఎన్నో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రత చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Also Read: Armaan Malik: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్స‌ర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్

ముగ్గురు స్పాట్ డెడ్.. 

నర్సాపూర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) కి వెళ్తున్న కారు అదుపుతప్పి అటుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరికొంతమంది తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. నర్సాపూర్ ఫారెస్ట్‌ రోడ్డు గుమ్మడిదల దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బయటకు వెళ్లిన తమవారు ఇక తిరిగిరారని తెలిసి గుండెలు బాదుకుంటున్న దృశ్యాలు అందరి మనసుల్ని కలచి వేస్తున్నాయి. 

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

విశాఖలో మరో ప్రమాదం

ఇది ఇలా ఉంటే ఇటీవలే విశాఖలో మరో ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో.. లారీ షాప్‌లోకి దూసుకెళ్లింది. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది. అలాగే అక్కడే ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇప్పుడు ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు