Jangaon: దారుణం.. రూ.300ల కోసం హత్య చేసిన స్నేహితులు

జనగాం జిల్లాలో రూ.300 కోసం స్నేహితుడిని హత్య చేసిన దారుణ ఘటన జరిగింది. కోతిని ఆడిస్తూ.. తిరుగుతున్న ఓ వ్యక్తిని స్నేహితులు డబ్బులు అడిగారు. అతను నిరాకరించడంతో రాయితో కొట్టి నిప్పు అంటించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
pakala beach

crime

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకన్న అనే వ్యక్తి కోతిని ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకన్నను అతని స్నేహితులు రూ.300 అడిగారు. అతను ఇవ్వకపోవడంతో వెంకన్నకు, స్నేహితులకు మధ్య గొడవ జరిగింది.

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

బండరాయితో కొట్టి..

వివాదం ఇంకా ముదరడంతో జిల్లాలోని వినాయక బార్ వెనకాల వెంకన్నను బండ రాయితో కొట్టి నిప్పు అంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర (Maharashtra) లో ఓ విషాదం చోటుచేసుకుంది. తండ్రి కొత్త ఫోన్ కొనివ్వలేదని ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చావును చూడలేని తండ్రి అదే తాడుతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాందేడ్‌లోని ఓంకార్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. దీని కోసం స్మార్ట్‌ఫోన్ కావాలని తండ్రికి అడిగాడు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని తండ్రి మొబైల్ కొనివ్వకపోవడంతో మనస్థాపం చెంది పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

ఎంత సమయం అయిన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూసేసరికి చనిపోయి కనిపించాడు. తీవ్ర ఆవేదన చెందిన తండ్రి వెంటనే అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో తండ్రి కొడుకులు ఒకేసారి చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు