వికారాబాద్‌లో ఘోర ప్రమాదం

తెలంగాణలో వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తాండూరుకి చెందిన ఓ కుటుంబం వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

New Update
accident (1)1

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు అతివేగం లేదా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా రోజుకీ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇలా మరణించిన వారి సంఖ్య మనకి పదుల్లో మాత్రమే తెలుస్తోంది. కానీ తెలియకుండా జరిగిన యాక్సిడెంట్లు కూడా ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఇది శీతాకాలం కావడంతో.. పొగమంచు వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్

వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..

ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణలో వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరుకి చెందిన ఓ ఫ్యామిలీ వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే

గ్రామ సమీపంలోనే ఈ ఘోర ప్రమాదం..

ఇంకా కొద్ది సమయంలో గ్రామానికి చేరుకుంటారనగా.. ఓ లారీ కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం అంతా నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. తీవ్రంగా గాయపడటంతో స్థానిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక మహిళ పరిస్థితి తీవ్రంగా ఉంది. దీంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును ఢీకొట్టిన లారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. 

ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!

ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు