Ganja Business: సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అరెస్టు

ఎక్సైజ్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను అధికారులు అరెస్టు చేశారు. కారు డోరు అరల్లో10 కేజీల గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు.

New Update
Hyderabad : అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

Hyderabad

సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్‌లో 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అరకు నుంచి హైదరాబాద్‌కు గంజాయి (Ganja) ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గంజాయిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హెచ్‌ఎంటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి అక్రమానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

ఆంధ్ర నుంచి గంజాయి తీసుకొచ్చి..

ప్రవీణ్ వర్మ అనే ఉద్యోగి హెచ్ఎంటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. జీతం సరిపోవడం లేదని, అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఆంధ్ర-ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కారు డోరు అరల్లో గంజాయి ప్యాకెట్లను ఉంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రవీణ్ శర్మ మధ్యలో దిగిపోయి వేరే డ్రైవర్‌ను ఎక్కించి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

ఇదిలా ఉండగా..న్యూఢిల్లీ (New Delhi) లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇథియోపియా నుంచి వస్తున్న కెన్యా పౌరుడిని టెర్మినల్-3 వద్ద అధికారులు అనుమానంతో చెక్ చేశారు. మొదట అతను సాకులు చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత 67 కొకైన్ గుళికలను మింగినట్లు ఆ యువకుడు ఒప్పుకున్నాడు. అక్రమ రవాణా కోసం వాటిని ఇండియాకి తీసుకొస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు. వెంటనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆసుపత్రికి పంపారు. 

ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

వైద్యుల పరివేక్షణలో ఆ యువకుడి కడుపు నుంచి 67 గుళికలను తొలగించారు. మొత్తం అందులో 996 గ్రాముల హై-పూర్యిటీ కొకైన్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపుగా రూ.14.94 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అక్రమంగా వీటిని రవాణా చేసినందుకు ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 21, 23, 29 కింద ఆ యువకుడిని అరెస్టు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను సురక్షితంగా ఉంచారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు