హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ప్లాస్టిక్ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఇదిలా ఉండగా ఇటీవల ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందడంతో పాటు మరికొందరు ప్రమాదంలో గాయపడ్డారు. వారిని బోనా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ప్రజలందరూ ఒక వివాహ వేడుకకు వెళ్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. నదిలో ప్రజల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి! అకస్మాత్తుగా ట్రక్కు దారి తప్పి నదిలో పడిపోయింది. మరోవైపు నదిలో ప్రజల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు, ప్రభుత్వ శాఖలు సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇథియోపియాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయని అక్కడి అధికారులు తెలిపారు. పేలవమైన డ్రైవింగ్ ప్రమాణాలు, శిథిలమైన వాహనాలు ఇక్కడ సురక్షితమైన రవాణాకు అతిపెద్ద అవరోధాలని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి