Car Accident: ఘట్కేసర్ కారు దగ్ధం కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నట్లు మృతులు శ్రీరామ్, లిఖిత లేఖలో పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారం తెలిసి చింటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, అది తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డట్లు స్పష్టం చేశారు. ఇద్దరు సజీవదహనం.. ఈ మేరకు సోమవారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలు కీలక ట్విస్టు చోటుచేసుకుంది. కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ముందుగా పోలీసులు కూడా భావించారు. కానీ దీనిపై విచారణ చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. కారులో సజీవదహనమైన ఇద్దరూ కూడా ప్రేమ జంట అని, కారులో పెట్రోల్ పోసుకొని వారే నిప్పంటించుకొని సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో చేరింది. మృతులు శ్రీరామ్, లిఖితగా గుర్తించారు. ఇది కూడా చదవండి: KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే! అయితే ఇరు కుటుంబాల పెద్దలు వాళ్ల పెళ్లికి అంగీకరించలేదని.. అందుకే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు సూసైట్ చేసుకునే ముందు కూడా వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఘటనాస్థలంలో పోలీసులు 3 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ స్వస్థలం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జమ్ములపేట. ఇక లిఖిత మేడ్చల్ జిల్లాకు చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.