Canada: మరో రెండు విమానాలు క్రాష్?

దక్షిణ కొరియా విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు వేర్వేరు చోట్ల ఫ్లైట్లు అదుపు తప్పాయి. కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టుతో పాటు నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో విమానాలు అదుపు తప్పాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదాలు తప్పాయి.

New Update
Canada Flight Crash

Canada Flight Crash Photograph: (Canada Flight Crash)

దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్ట్‌లో విమానం అదుపు తప్పి 179 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు చోట్ల వేర్వేరు ప్రదేశాల్లో విమాన ప్రమాదాలు జరిగాయి. హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో కెనడాకు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

ల్యాండ్ అవుతున్న సమయంలో..

కెనడాలోని సెయింట్ జోన్స్ నుంచి హాలిఫాక్స్‌కు వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో గేర్ విఫలం అయ్యింది. దీంతో రన్‌వేపైకి జారిపోవడంతో మంటలు ఏర్పడ్డాయి. విమాన రెక్కలు పూర్తిగా రన్‌వేకు రాసుకుపోవడం వల్ల మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

ఈ రెండింటితో పాటు నార్వేలో కూడా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాయల్ డచ్‌కు చెందిన విమానం టోర్ప్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై అదుపు తప్పింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడంతో విమానం అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 182 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం గడ్డి మీద ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

ఇది కూడా చూడండి:  ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు