Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఊడిపోయి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Brazil

Brazil Photograph: (Brazil)

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపుగా 38 మంది మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైన్‌లో హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు శనివారం ఢీకొన్నాయి. ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

బస్సు టైరు ఊడిపోవడంతో..

అకస్మాత్తుగా బస్సు టైరు ఊడిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కును ఢీకొడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో కారు కూడా బస్సును ఢీకొట్టగా.. అందులోని వారు సురక్షితంగా ప్రాణలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు