Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్‌మెంట్‌లో కలకలం!

తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు కుటుంబ కలహాలతో ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
si

Bhadradri Kothagudem Gundala AR SI Surnapaka Lakshminersu Suicide

Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.

ఇంట్లోనే ఫ్యాన్ కు ఊరేసుకుని..

ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి15వ బెటాలియన్‌కు చెందిన సుర్ణపాక లక్ష్మీనర్సు (36) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం ఉదయం ఉన్నట్టుండి తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: AP News: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. క్యాబినెట్‌లో కీలక నిర్ణయం!

వెంటనే పస్రా ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో నర్సు చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Buddha Venkanna: జగన్ ఓ పశుపతి.. బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్స్!

ఇదిలా ఉంటే.. ఇటీవల వాజేడు ఎస్సై సురేష్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలా వరుసపెట్టి పోలీసుల హత్యలు, ఆత్మహత్యలు జరగడం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే భయంతో ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పై అధికారుల ఒత్తిడి, అక్రమ సంబంధాలు, అవినీతి కారణంగా పోలీసులు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు