న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో సంతోషాన్ని ఇస్తే.. మరికొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. అయితే కొత్త సంవత్సరం నాడు బాపట్లలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మార్టూరు మండలం డేగరమూడి సమీపంలో నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం బ్రేకులు ఫెయిల్ కావడంతో.. ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో.. లారీ షాప్‌లోకి దూసుకెళ్లింది. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది. అలాగే అక్కడే ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇప్పుడు ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే! సీసీ ఫుటేజీ ప్రకారం.. రోడ్డుకు ఎదురుగా ఒక కిరాణా షాపు ఉంది. ఆ షాప్‌కు ఓ యువతి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు అడిగింది. ఇంతలోపు రోడ్డుపై నుంచి ఒక ఇసుక లారీ స్పీడ్‌గా దూసుకువస్తున్నట్లు కనిపించింది. అయితే అది స్లో కాకపోవడంతో కిరాణా షాపు మీదికి దూసుకొచ్చింది. అదే సమయంలో ఆ యువతి ముందుగానే చూసి పక్కకు తప్పుకుంది. కానీ ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!