/rtv/media/media_files/2025/01/10/7R032UgGpyhTgRg56mbe.jpg)
accident sdpt Photograph: (accident sdpt)
Accident News: ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తున్న బస్సు విజయనగరంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్‌ట్యిట్యూట్ బస్సు ఢీకొట్టింది. బస్సులో 42 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి, కూతురు చనిపోయారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. వారంతా ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం వెళ్తున్నట్లు సమాచారం.
Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
సంఘటనా స్థలానికి 5 అంబులెన్స్ చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. బస్సులో ఉన్నవాళ్లు అంతా ఒరిస్సా రాష్ట్రంలో మల్కాజిగిరి వాసులుగా పోలీసులు గుర్తించారు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్