Bus Accident: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు!
తెలంగాణలో దారుణం జరిగింది. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదానికి గురైంది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది.
తెలంగాణలో దారుణం జరిగింది. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదానికి గురైంది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది.
అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
ఏపీలో వరుస బస్సుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు లారీడ్రైవర్, క్లీనర్ మృతిచెందారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు టూరిస్టు బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
బెంగళూరులోని సిరా-హిరియూరు హైవేపై ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న బస్సు కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు వ్యాపించాయి. 13 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది.