Padma Awards : పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీళ్లే!

టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.

New Update
padma awards

padma awards Photograph: (padma awards)

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ప్రతి ఏటా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది.  వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ఈ అవార్టులను ప్రకటిస్తుంది. వివిధ రంగాలలో కృషిచేసిన భారత పౌరులకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల పేరిట అవార్టులను ప్రకటిస్తుంది. 

అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఐదు మందినే ఈ పద్మ పురస్కారాలు వరించాయి. ఎన్టీఆర్ కు 1968లో  పద్మశ్రీ-, అక్కినేని నాగేశ్వరరావుకు 1968లో పద్మశ్రీ-, 1988లో పద్మ భూషణ్-, 2011లో పద్మ విభూషణ్ వరించాయి-. హీరో కృష్ణకు 2009లో పద్మభూషణ్-, చిరంజీవికి 2006లోపద్మభూషణ్-, -2024లో పద్మ విభూషణ్, నందమూరి బాలకృష్ణకు-2025లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి.  

అత్యధికంగా మహారాష్ట్రకు

2025 సంవత్సరానికి గానూ కేంద్రంలో ప్రకటించిన 139 పద్మ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

Also Read :  ఎన్టీఆర్ కొడుకు నుంచి పద్మ భూషణ్ వరకూ.. 50 ఏళ్ల బాలకృష్ణ అన్ స్టాపబుల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు