అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడితో వివాదం మరింత ముదిరింది. దాడి చేసిన వారిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. Also Read: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్! నిందితులపై పలు సెక్షన్లు ఈ ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఈ ఆరుగురికి రిమాండ్ విధించింది. Also Read: అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్ సినిమా వాళ్లను టార్గెట్ చేసి ఎటాక్ చేశారు మరోవైపు అల్లు అర్జున్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్‌కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సపోర్ట్‌గా నిలిచాయి. బన్నీ ఇంటిపై కుట్రతోనే దాడి చేశారంటూ ఈ రెండు పార్టీలు కౌంటర్లు వేశాయి. సినిమా వాళ్లను టార్గెట్ చేసి ఎటాక్ చేశారంటూ ఆరోపించాయి. Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్! దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వారంటూ విమర్శలు గుప్పించాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలే దాడి చేయించారంటూ కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ వేసింది. కాగా ఇప్పటికే బన్నీ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ, హరీశ్ రావు ఖండించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగాయంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్