అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తీరుపై సంచలన చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ కుటుంబం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని, తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేందుకు చూస్తున్నారని చెప్పాడు. అయితే ఈ ఇష్యూపై కొందరు అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు రేవంత్ వ్యాఖ్యల్ని తప్పు బడుతున్నారు. ఇందులో భాగంగానే ఓ సినీ విశ్లేషకుడు ఆ రోజు తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఏం చేశాడో క్లుప్తంగా వివరించారు. ఇది కనుక నిజమైతే...?ఇంట్లో మనిషివని రేపొద్దున @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan క్షమించినా సమాజం మటుకు నిన్ను క్షమించదు ... ఛీ @alluarjun pic.twitter.com/zU1k9j3KIO — Onion Slice🧢 (@pepper__spray) December 21, 2024 పోలీసులు చెప్పినా వినలేదు.. ' తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది, మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోండి లాఅండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయితే మేము కాపాడలేమని పోలీసులు చెప్తే.. ఈ పాట అయిపోగానే వెళ్తా, ఈ ఫిట్ అయిపోగానే వెళ్తా, నేను ఇలా మధ్యలోనే వెళ్తే నా సినిమా బాలేదని అనుకుంటారు అని అల్లు అర్జున్ బాధ్యత లేకుండా వ్యవహరించాడు. ఆ రోజు ఏసీపీ.. అల్లు అర్జున్ ను అడిగిన ఒక్క ప్రశ్న అతన్ని జీవితాంతం వెంటాడుతుంది. జీవితాంతం వెంటాడుతుంది.. ' ఏం చదువుకున్నావ్, నీకు కామెన్స్ సెన్స్ ఉందా? చెప్తుంటే అర్ధం కాదా? అవతల ఓ మనిషి చనిపోయిందని చెప్తుంటే నా సినిమా అంటావ్, నా పాట అంటావ్.. అని ఆ రోజు ఏసీపీ అల్లు అర్జున్ తో అన్నాడు. అది అల్లు అర్జున్ ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది..' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.