Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో తాజాగా OU జేఏసీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసినందుకు అతడి అభిమానులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని లేదంటే.. చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు ఆర్మీ, అల్లు ఫ్యాన్స్ పేర్లతో వస్తున్నాయని.. తమకు బెదిరింపులు రాకుండా అల్లు అర్జున్ తమ ఫ్యాన్స్ ని అదుపులో పెట్టుకోవాలని. బెదిరింపులు ఆగకపోతే ఈ సారి 30 వేల మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని OU JAC నాయకులూ వార్నింగ్ ఇచ్చారు. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ ఇంటి పై రాళ్లతో దాడి.. అయితే సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో డిసెంబర్ 22న ఓయూ జేఏసీ నాయకులు బన్నీ ఇంటి పై దాడి చేశారు. అల్లు అర్జున్ బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైకి తిరగబడ్డారు. ఇంటి ముందు పూలకుండీలను ధ్వంశం చేశారు. అల్లు అర్జున్ కారణంగానే రేవతి చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. వెంటనే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని.. కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాడి గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు జేఏసీ నాయకులని అదుపులోకి తీసుకున్నారు. Also Read: Game Changer: పుష్ప VS గేమ్ ఛేంజర్.. సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ ! సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ముందు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై