Vasudevan Nair : మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వయసు పైబడడం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. Also Read: Dead Body Parcel Case: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? Malayalam Author And Director Vasudevan Nair Passed Away వాసుదేవన్ 1933 జూలై 15వ తేదీన పాలక్కాడ్ సమీపంలోని కడలూరులో పుట్టారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. Also Read: CYBER SCAM: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! ఆయన రచించిన "నాలుకెట్టు, అసురవిత్తు, మంజు, సర్పవిత్తు" లాంటి మరిన్ని రచనలు పాఠకుల ఆదరణ పొందాయి. అయితే, కొంత కాలం పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఎంటీ వాసుదేవన్ నాయర్ ఆ తరువాత 1960వ దశాబ్దంలో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 54 సినిమాలకు ఆయన స్ర్కీన్‌ప్లే అందించారు. అలాగే, పలు చిత్రాలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు. Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్ ఆయన దర్శకత్వం వహించిన నిర్మాల్యం, కడవు లాంటి మూవీస్ కు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకున్నాయి. నాలుగు సార్లు ఉత్తమ స్కీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డులను వాసుదేవన్ దక్కించుకున్నారు. 1995లో ఎంటీ వాసుదేవన్ నాయర్ కు కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డును కూడా బహుకరించింది. 2005లో పద్మభూషణ్ తో సత్కరించింది. Also Read: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!