కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందూ, క్రిస్టియన్.. రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇప్పటివరకు కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు. పెళ్ళికి ముందు సైన్ చేసిన బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్' ను పూర్తి చేసి ఇటీవల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది. Also Read : అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్! సినిమాలకి గుడ్ బై.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పి తన భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆంథోని కి దుబాయ్ లో పలు వ్యాపారాలు ఉన్నాయి. అలాగే తన భర్తతో కలసి బిజినెస్ పనుల్లో తోడుగా ఉండాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలి. కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన 'బేబీ జాన్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్ ధావన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ