WAR -2 Movie Updates: విలన్‌గా ఎన్టీఆర్‌..! ఇక బాలీవుడ్ రికార్డులు బద్దలే..!

"వార్ 2" తో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు జూ. ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో కలిసి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ హై వోల్టాజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది, 'వార్-2' లో ఎన్టీఆర్ EX-RAW ఏజెంట్‌గా, విలన్ గా కనిపించనున్నాడు.

New Update
WAR -2 Movie Updates

WAR -2 Movie Updates

WAR -2 Movie Updates: "వార్ 2" అటు టాలీవుడ్(Tollywood) ఇటు బాలీవుడ్(Bollywood) చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ యూనిట్. అయితే ఈ  సినిమా ద్వారా ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌(Jr ntr Bollywood Entry)లో అడుగు పెడుతున్నారు.  హృతిక్ రోషన్‌(Hritik Roshan)తో కలిసి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ(Director Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌(Yash Raj Film Production)లో రూపొందుతుంది. అయితే "వార్ 2" మూవీ హై వోల్టాజ్ యాక్షన్ డ్రామా(Action Drama)గా ఉండబోతోంది.

Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

WAR -2లో వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్...

తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో వీరేంద్ర రఘునాథ్(Veerendra Raghunath) అనే పాత్రలో కనిపిస్తారు. ఒక దక్షిణాది రాష్ట్రానికి చెందిన EX - RAW ఏజెంట్‌గా కనిపిస్తాడని సమాచారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ మధ్య జరిగే యుద్ధం చుట్టూ తిరుగుతోందట, ఇది హిందీ సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి భారీ స్థాయి యాక్షన్ ఫార్మాట్ లో ఉంటుందని సమాచారం.

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

"వార్ 2" పూర్తి అయిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయి(Pan India)లో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabahs) తో  "సలార్ పార్ట్ 2"(Salaar Part- 2) తీస్తున్నారు. ఎన్టీఆర్ లైనప్ లో నెక్స్ట్ "దేవర 2"(Devara- 2) కూడా ఉంది, అయితే 'దేవర 2' కి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

"RRR", "దేవర" చిత్రాల విజయంతో హిందీలో కూడా  ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఇప్పుడు 'వార్-2' తో ఎన్టీఆర్ ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తాడో చూడాలి.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు