ప్రముఖ నటుడు, తారక్ మెహతా కా ఊల్తా చష్మా ఫేమ్ గురుచరణ్ సింగ్ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజుల నుంచి అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరి.. సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేశారు. తాను అస్వస్థతకు గురయ్యానని, అందుకే ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఇప్పటికీ రక్త పరీక్షలు జరగ్గా ఇంకా రిపోర్ట్స్ రాలేదని తెలిపారు. గురు గోవింద్ సింగ్ సాహెబ్ మహరాజ్‌కు లక్ష కోట్ల అభినందనలు.. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. త్వరలోనే తన ఆరోగ్యం గురించి పూర్తిగా చెబుతానన్నారు. ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ Actor Gurucharan Singh, best known for his portrayal of Roshan Singh Sodhi in the popular TV show Taarak Mehta Ka Ooltah Chashmah, recently shared a heartfelt video from his hospital bed pic.twitter.com/8S25eu2UvD — Bollywood World (@bwoodworld) January 8, 2025 ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి గతంలో ఓసారి తప్పిపోయారు.. ఇదిలా ఉండగా గతంలో గురుచరణ్ సింగ్ (Gurucharan Singh) అదృశ్యమయ్యారు. గతేడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో తన ఇంటి నుంచి ముంబైకి బయలుదేరారు. అక్కడ అతన్ని పికప్ చేసుకోవడానికి స్నేహితుడు వచ్చాడు. కానీ గురుచరణ్ సింగ్ ఎయిర్‌పోర్టుకు మాత్రం రాలేదు. తన మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి మూడు వారాల తర్వాత స్వయంగా గురుచరణ్ ఇంటికి వచ్చాడు. ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లినట్లు తెలిపాడు. మూడు వారాల్లో అమృత్‌సర్, లూథియానాతో పాటు ఇతర ప్రదేశాలు కూడా సందర్శించాడు. పాపులర్ టీవీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో రోషన్ సింగ్ సోధీ పాత్రను గురుచరణ్ పోషించారు. ఈ షోతోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తండ్రి అనారోగ్య కారణంగా ఆయన 2020లో దీని నుంచి బయటకు వచ్చారు. ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!