మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఆ మూవీ ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం . అయితే ఇప్పుడీ స్టోరీ విషయంలో అనిల్ ఓ టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ Anil Ravipudi New Movie Update ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కథలో కొన్ని రకాల మార్పులు చేస్తే అది మల్టిస్టారర్ గా మార్చవచ్చని అనిల్ అనుకుంటున్నాడంట. ఇదే నిజమైతే మెగా-కింగ్ అభిమానులు కోరిక తీరిపోతుంది. చిరంజీవి-నాగార్జులను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఇద్దరు ఎంత గొప్ప స్నేహితులు అన్నది అందరికీ తెలిసిందే. వారిద్దరూ కలిసి బిజినెస్ లు కూడా చేస్తున్నారు. Also Read: Telangana: లడ్డూ ప్రసాదం.. ఆలయ ఈవోలకు దేవాదాయశాఖ కీలక ఆదేశాలు ఖాళీ సమయం దొరికితే చిరంజీవి నాగార్జునతో కలిసి టైంపాస్ చేస్తుంటారు.అలాంటి నాగార్జునతో కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి చాలా కాలాంగా ఆశపడుతున్నారు. కానీ స్టోరీ దొరకకపోవడంతో వీలు పడలేదు. ఇప్పుడు అనిల్ రూపంలో చిరంజీవికి ఆ ఛాన్స్ దొరుకుతున్నట్లే అనిపిస్తుంది. Also Read: New Chief Secretary: నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు! ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను గానీ, సీనియర్ హీరోలను గానీ డీల్ చేయడం అన్నది అనిల్ కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే `ఎఫ్ -2`,` ఎఫ్ -3` చిత్రాలతో వెంకటేష్- వరుణ్ తేజ్ లను డీల్ చేశాడు. Also Read: 2024 Top Premium Bikes: ఈ ఏడాది రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్స్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్! ఆ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు-నాగ్ లను మేనేజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. అయితే కథ అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. అదీ అనిల్ మార్క్ స్టోరీ అవుతుందా? అందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది మాత్రం తెలియాలి. ఎఫ్ సిరీస్ చిత్రాలను కామెడీ నేపథ్యంలోనే తెరకెక్కించిన విషయం తెలిసిందే.