అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను విడుదల చేశారు. స్వయంగా తానే బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పానంటూ ఏసీపీ వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట గురించి వివరించారు. ఇందులో భాగంగానే తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న SHO రాజు నాయక్ మీడియాతో మాట్లాతుడూ ఎమోషనల్ అయ్యారు. ఎంతో ట్రై చేశా.. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయాననే బాధ గత 15 రోజులుగా ఉందని అన్నారు. శ్రీతేజ్ తన చేతుల్లోనే ప్రాణాలు విడిచాడని, బ్రతికించేందుకు తాను ఎంతగానో ట్రై చేసానని చెప్పాడు. అంతేకాదు దేవుడి దయవల్ల బాబు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నేనూ కింద పడిపోయా.. అలాగే రెండు థియేటర్స్ ఒకే చోట ఉండటంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయాం. మేనేజ్ మెంట్ మా ఎదురుగానే ఉన్నారు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గేట్లు పగలగొట్టి జనాలు లోపలి వచ్చారు. ఆ తొక్కిసలాటలో నేను కూడా కింద పడిపోయా. నిజానికి ఆ తొక్కిసలాటలో నేనే చనిపోతానని అనుకున్నా. దేవుడి దయ వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నా. ఆ రోజు పరిస్థితి ఇలా ఉంది.' అని అన్నారు. కాగా తొక్కిసలాటలో కి స్పృహ తప్పి పడిపోయిన శ్రీతేజ్ కు SHO రాజు నాయక్ సీఏపీఆర్ చేశారు. అయినప్పటికీ అతను కోలుకోకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ మాట వాస్తవమే.. మరోవైపు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వలేదని రాజు నాయక్ వెల్లడించారు. యాజమాన్యం అనుమతి కోరిన మాట వాస్తవమేనని, కానీ ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటం వల్ల హీరో వస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పాం. ఈ విషయం యాజమాన్యం హీరోకు చెప్పిందో లేదో తమకు తెలియదని చెప్పుకొచ్చారు.