ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) మళ్లీ క్విక్ డెలివరీ సేవలను ప్రారంభించింది. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు జొమాటో రెడీ అవుతుంది. అయితే గతంలో ఈ సర్వీస్ ఉండగా.. పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీంతో మధ్యలోనే ఆపేసింది. ఇప్పుడు ఫుడ్ డెలివరీ విషయంలో పోటీ పెరుగుతుండటంతో మళ్లీ ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని జొమాటో ప్రకటించలేదు. ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే! Zomato has discreetly introduced a 15-minute food delivery feature, raising the stakes in the quick-commerce race. Currently live in select locations, this move pits Zomato against competitors like Swiggy's Bolt, Magicpin, and Zepto, reshaping the fast-food delivery game.… pic.twitter.com/NfLMRETD4j — Ascendants (@AscendantsDotIn) January 8, 2025 ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి కేవలం రెండు కిలీమటర్ల పరిధి వరకు.. ముంబాయి, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఈ క్విక్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జొమాటో యాప్‌లో కూడా అప్లికేషన్ సెర్చ్‌లో 15 నిమిషాల డెలివరీ అనే ట్యాబ్ కూడా కనిపిస్తోంది. ఇందులోకి వెళ్తే.. వెంటనే తయారయ్యే రెసిపీలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ క్విక్ డెలివరీని కేవలం రెండు కిలీమీటర్ల పరిధిలో ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది కూడా చూడండి: ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి : కోర్టు మెట్లెక్కిన రమ్య ఇదిలా ఉండగా బోల్ట్ (Boalt) పేరుతో స్వీగ్గీ 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలను గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించింది. దీంతో పాటు ఓలా కూడా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఇటీవల తెలిపింది. దీనికోసం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సాయంతో డెలివరీ చేయనుంది. ఈ క్రమంలోను జొమాటో కూడా క్విక్ డెలివరీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Home Tips: వంటగది సింక్ జామ్ అయితే ఇలా చేయండి